రాజకీయాల్లో పట్టువిడుపులుండాలి అంటారు .సమయాన్ని చూసి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొని దూసుకుపోవాలి తప్ప తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
ఇప్పుడు షర్మిల వ్యవహారంలో కూడా పరిస్థితులు ఇలానే అడ్డం తిరిగినట్లుగా తెలుస్తుంది.తెలంగాణలో అధికార బారాస ని ఓడించడానికి కలిసి వచ్చే పార్టీలన్నిటిని కలుపుకుని ముందుకెళ్లాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది.
పార్టీ ని కూడా షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి .షర్మిల కూడా ఖండించక పోవడం తో విలీనం ఖాయమే అని అందరూ నమ్మరు అయితే చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడానికి షర్మిల పట్టుదలే కారణ మని వార్తలు వస్తున్నాయి .

ఆమె విధించిన కొన్ని షరతులతో విలీన ప్రక్రియ మళ్ళీ మొదటికే వచ్చిందని ,ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని అంతే కాకుండా తన అనుచరులకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాలని పట్టు పట్టిన షర్మిల రాజకీయ సమీకరణాలు అడ్డం తిరగడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడినట్లుగా తెలుస్తుంది.

ముఖ్యంగా ఖమ్మంలో బలమైన అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivasa Reddy ), తుమ్మల నాగేశ్వర రావు లాంటి రాజకీయ ఉద్దండులు పార్టీలోకి చేరటం, మరోపక్క కమ్యూనిస్టులు కూడా జత కలవడంతో షర్మిల డిమాండ్లను నెరవేర్చలేని పరిస్థితుల్లో షర్మిల పార్టీ విలీనాన్నికూడా కాంగ్రెస్ వదులుకోవడానికి సిద్ధమైందని సమాచారం.నిజానికి షర్మిల రాకతో ఆంధ్ర ముద్ర పడుతుందని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ సాహసించింది.దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి వారసురాలు కావడం ఆయన అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఓటర్లు ఆమె వైపు ఉంటారనే ఆలోచనతోనే కాంగ్రెస్( Congress party ) ముందుకెళ్ళింది.
అయితే చర్చలు సుదీర్ఘకాలం కొనసాగటం షర్మిల పట్టు విడుపులు లేకుండా ప్రవర్తించడం తో నిర్ణయాలు జాప్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఈలోపు సమీకరణాలు మారిపోవడం తో ఎంపీ సీటుతో సర్దుకోవాల్సిన పరిస్థితి షర్మిలకు వచ్చిందని అయితే ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేని పక్షంలో దాదాపు షర్మిల పార్టీ విలీనం లేనట్టే అన్నది వినిపిస్తున్న వార్తల సారాంశం .