కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో( Congress Election Manifesto ) ఇవాళ విడుదల కానుంది.ఈ మేరకు జాతీయ మ్యానిఫెస్టోను పార్టీ అధిష్టానం అధికారికంగా విడుదల చేయనుంది.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul gandhi )మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
మ్యానిఫెస్టోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఆవాజ్ భారత్ వెబ్ సైట్( Awaaz Bharat ) ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది.నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, వెనుకబడిన వర్గాల హక్కులు, రైతు సమస్యలతో పాటు మహిళలకు మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారు.కాగా ఇప్పటికే ఐదు న్యాయాల పేరుతో 25 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యానిఫెస్టో మహిళలకు, శ్రామికులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా రూపకల్పన చేశారు.అదేవిధంగా రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్, రైతులకు కనీస మద్ధతు ధరపై హామీ ఇవ్వనుంది.