తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.
ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేరుకోనున్నారు.అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ లోని రామప్ప దేవాలయానికి చేరుకోనున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
కాగా ఈ బస్సు యాత్ర రామప్ప గుడి నుంచి ములుగుకు చేరుకోనుంది.ములుగులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్, ప్రియాంక సభా వేదికపై నుంచి మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.
అదేవిధంగా ములుగు సభ తరువాత బస్సు యాత్ర భూపాలపల్లికి చేరుకోనుంది.అక్కడ నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహిస్తారు.







