ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
మార్చి ఒకటిన తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు.

ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ, వైసీపీ( TDP an, YCP )లు విఫలం అయ్యాయని పేర్కొన్నారు.ఏపీకి ఇచ్చిన ఒక్క మాటను కూడా మోదీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు.పదేళ్లుగా ఏపీని బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు.
ఏపీలో అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.







