తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశానికి రెండో రాజధాని అంశం తెరపైకి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.తమది ఢిల్లీ పార్టీ కాదన్న ఆయన తెలంగాణ పార్టీ అని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరంలో ఉన్నామని మంత్రి గంగుల వెల్లడించారు.హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని చెప్పారు.
కరీంనగర్ లో తమకు 60 శాతం పాజిటివ్ ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసం కొట్లాడాలని స్పష్టం చేశారు.