కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) కోలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్( Vijay ) దళపతి తో తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.లోకేష్ కనకరాజ్ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు స్టార్ డైరెక్టర్ గా నిలవడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు కున్నాడు.
బాగా డిమాండ్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరిగా లోకేష్ ఉన్నారు.ఖైదీ, విక్రమ్ లతో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కు గేట్లు తెరిచిన లోకేష్ ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి నేమ్ అండ్ క్రేజ్ ను పెంచుకున్నాడు.
ఇలా ఇప్పుడు ఈయన చేస్తున్న ”లియో” సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ పెరిగిందో ఎవ్వరి ఊహలకు అందడం లేదు.ఎన్ని చోట్ల ప్రీ సేల్స్ తో ఈ మూవీ అదరగొడుతుంది అనే చెప్పాలి.

ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో ప్రేక్షకులు ఎదురు చూస్తారని ఎవ్వరూ అనుకోలేదు.ఈ సినిమాకు ఇంత క్రేజ్ పెరగడానికి కారణం విక్రమ్ అనే చెప్పాలి.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది భాగం అని సినిమా స్టార్టింగ్ లో ప్రకటన చేసినప్పటికీ ఆ తర్వాత మేకర్స్ ఈ విషయంలో గోప్యంగా ఉన్నారు.కానీ ఈ సస్పెన్స్ ను తాజాగా ఒక స్టార్ హీరో రివీల్ చేసాడు.

ఈ సినిమా చుసిన ఉదయనిధి స్టాలిన్( Udayanidhi Stalin ) లియో టీమ్ కు కంగ్రాట్స్ చెబుతూ ”ఎల్ సి యు’‘ అని మెన్షన్ కూడా చేయడంతో ఈ సినిమా ఎల్ సి యు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పాలి.ఇది సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని ఫ్యాన్స్ ఫిక్స్ అవ్వడంతో ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది.అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.చూడాలి మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో అంచనాలు అందుకుంటుందో.







