ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సెలబ్రిటీలలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.కండక్టర్ ఝాన్సీ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుందని అమ్మమ్మ వాళ్లు దూరం పెట్టారని ఝాన్సీ చెప్పుకొచ్చారు.నాన్న కానిస్టేబుల్ అని నేను, తమ్ముడు పుట్టిన తర్వాత నాన్నకు అప్పటికే పెళ్లి కావడంతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసిందని ఝాన్సీ అన్నారు.
అమ్మ నాన్నను నిలదీయడంతో నాన్న అమ్మను వదిలేశాడని ఝాన్సీ చెప్పుకొచ్చారు.అమ్మ కోర్టులు, కేసులు అని తిరగడం వల్ల నా చదువు దెబ్బ తిందని ఝాన్సీ కామెంట్లు చేశారు.
ఆ తర్వాత అమ్మ కూరగాయల దుకాణం పెట్టుకుని మమ్మల్ని పెంచిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.నాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో నిర్వాహకులు 150 రూపాయలు చేతిలో పెట్టారని ఆ డబ్బులను చూసి సంతోషంగా ఏడుపొచ్చిందని ఝాన్సీ వెల్లడించారు.నా తొలి సంపాదన 150 రూపాయలు అని ఝాన్సీ అన్నారు.
కష్టమైనా నష్టమైనా డ్యాన్సర్ గా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని అనిపించిందని ఝాన్సీ చెప్పుకొచ్చారు.ఇంటర్ వరకు చదివానని 15 సంవత్సరాలుగా డ్యాన్స్ చేస్తున్నానని ఝాన్సీ పేర్కొన్నారు.
తమ్ముడిని ఎంబీఏ చదివించానని తమ్ముడు హెచ్.ఆర్ గా జాబ్ చేస్తున్నాడని ఝాన్సీ అన్నారు.పల్సర్ బైక్ సాంగ్ తో ఊహించని స్థాయిలో పేరు రావడం సంతోషంగా ఉందని ఝాన్సీ తెలిపారు.మా టీం మొత్తం 16 మందితో కూడిన టీం అని ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురైనా నేను డ్యాన్స్ కు మాత్రం దూరం కాలేదని ఆమె పేర్కొన్నారు.
కండక్టర్ ఝాన్సీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.