తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో షెడ్యూల్ మేరకు రాష్ట్రంలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
ఈ క్రమంలో నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ పేర్కొన్నారు.వయోవృద్ధులు ఓటు వేయడానికి వాలంటీర్లను పెడతామన్నారు.
ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సీ విజల్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.







