జగిత్యాల జిల్లాలో ఆటో, టాక్సీ డ్రైవర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ మేరకు జిల్లాలోని మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన డ్రైవర్లు నిరసనకు దిగారు.
మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి స్థానిక ఆర్టీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.పాత బస్టాండ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్రైవర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మహాలక్ష్మీ పథకం కారణంగా డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.







