హన్మకొండ జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు నవ్య.తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.







