తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఈసీ అధికారులకు ఫిర్యాదు అందింది.ఆయన నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మండలి చైర్మన్ గా ఉంటూ టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రచారం చేయడం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈసీ స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.