పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌పై కంప్లైంట్.. ఎందుకంటే?

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా( Pushpa 2 ) విడుదల కావడానికి చకచకా పనులు జరిగిపోతుంటే మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై( Allu Arjun ) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

హైదరాబాదులోని( Hyderabad ) జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.రెండు రోజుల క్రితం పుష్ప 2 ఈవెంట్ బీహార్ లోని పాట్నా నగరంలో జరిగిన సంగతి తెలిసిందే.

Complaint Against Allu Arjun Over Army Name Details, Complaint , Allu Arjun ,pol

ఈ రెండు దాదాపు 3 లక్షల మంది హాజరైనట్లు సమాచారం.ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ ఆర్మీ( Army ) అంటూ వ్యాఖ్యానించారు.ఇందులో భాగంగానే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించి ఐకాన్ స్టార్ పై పోలీసులకు ఫిర్యాదు అందించారు.

Complaint Against Allu Arjun Over Army Name Details, Complaint , Allu Arjun ,pol
Advertisement
Complaint Against Allu Arjun Over Army Name Details, Complaint , Allu Arjun ,pol

ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన సంస్థ అంటూ దేశభద్రతకు సంబంధించిన అంశం అని తెలుపుతూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు బైరి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్మీ అనే పదం అంటే జాతీయ భద్రత, జాతీయ సమగ్రత అని ఆయన తెలిపారు.అలాంటి అంశాన్ని అభిమానులకు ఆర్మీ అని పెట్టడం సమంజసం కాదని ఆయన తెలిపారు.

చూడాలి మరి ఈ కేసుకు అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో.

Advertisement

తాజా వార్తలు