టాలీవుడ్ సూపర్ స్టార్ ఒకరు.కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకరు.
వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే.ఇద్దరు సూపర్ హిట్ సినిమాలతో దూసుకు పోతున్నారు.
సౌత్ లోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో వీరు ముందు వరుసలో ఉంటారు.మహేష్ బాబు నటించిన పలు సినిమాలను తమిళ్ లో రీమేక్ చేసి విజయ్ దళపతి సూపర్ హిట్లు అందు కున్నాడు.
ఈ ఇద్దరి హీరోల మధ్య ఎటువంటి గొడవలు లేవు.ఇద్దరి మధ్య మంచి స్నేహ భావం ఉంది.
అయితే ఇప్పుడు వీరిద్దరి ఫ్యాన్స్ మాత్రం వీరికి తలనొప్పిగా మారి పోయారు.వీళ్ళ మధ్య ఉన్నంత స్నేహం వీరి ఫ్యాన్స్ మధ్య లేకపోవడం గమనార్హం.
దానికి నిదర్శనం కూడా ఉంది.ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ జరిగింది.
అయితే ప్రసెంట్ వీరిద్దరి మధ్య చాలా విచిత్రమైన పోటీ ఎదురైంది.అయితే ఈ పోటీ ఎవరైనా క్రియేట్ చేసారా.
లేదంటే అలా జరుగుతుందా అనేది తెలియదు కానీ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట, విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాల మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది.ఈ రెండు సినిమాలు ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కానున్నాయి.

సినిమాలు మాత్రమే ఒకేసారి రావడం లేదు.ఇప్పుడు రిలీజ్ అవుతున్న పాటలు కూడా ఒకేసారి విడుదల అవుతున్నాయి.ఇప్పటికే ఈ రెండు సినిమాల నుండి మొదటి పాట ఒకేసారి వచ్చింది.అయితే బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు మాత్రం కళావతి కంటే పైచేయి సాధించింది.ఇక ఇప్పుడు రెండవ పాట కూడా ఒకేసారి రాబోతుంది.బీస్ట్ నుండి 19న వస్తుంటే.
.సర్కారు నుండి 20న పాట రాబోతుంది.
ఇలా రెండవ పాట కూడా అను కోకుండానే ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.మరి ఈ పోటీ ఎక్కడి వరకు పోతుందో చూడాలి.