అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్ర, చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని, వచ్చే వాళ్ళు కూడా రారని తన బినామిలా చేత చేయించే యాత్ర ఇది.రైతులు ఎవ్వరు ఈ యాత్రలో లేరు కేవలం చంద్రబాబు మనుషులే వున్నారు.
టీడీపీ వాళ్ళు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరు.పచ్చ కండువా కప్పుకొని పాద యాత్రలో తిరుగుతున్నారు.
ప్రజాదరణ లేని టీడీపీ యాత్ర ఖర్చంతా ఎక్కడి నుండి వస్తుందో, వచ్చిన సొమ్ము ఎక్కడ ఉందో లెక్కలు లేకుండా జరుగుతున్న యాత్ర.చదరపు అడుగులకు వేలు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని భవనాలు నేడు శిథిలావస్థకు చేరాయి.
కనీసం రాజధానికి ఒక కారు వెళ్తే మరో కారు రాలేని పరిస్థితి.ఎవరో అంటున్నారు ఢిల్లీ లో మా అమ్మాయికి అవమానం జరిగిందని మీ రాజధాని ఎదని.
ఎక్కడైనా విమానం ఎక్కితే మీకు రాజధాని లేదు దిగిపో అని అంటున్నారా? ఎం చదువుతున్నావ్, మీ ఊరు ఏంటి అని అడుగుతారు కానీ మీ రాజధాని ఏదని అడుగుతారా లేదు కదా గతం లో రాబిన్ హుడ్ అనే వ్యక్తి గురించి విన్నాం డబ్బున్నోడిని కొట్టి పేదోడికి పెట్టేవాడిని మరి చంద్రబాబు చేస్తున్నదేంటి.రాష్ట్రం లో పేదోలందరిని కొట్టి అమరావతి లో ఉన్న డబ్బున్నోలకి పెడుతున్నాడు.
అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొవట్లేదు వైస్సార్సీపి లక్ష్యం ప్రతి పేదవాడికి, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలి, వారి ఆర్థిక స్థితిగతిని మార్చాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యిదే సంకల్పం తో ముందుకు వెళతాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు రాద్దాంతం చేస్తున్న ఈ చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎంత మానసిక క్షోభ అనుభవించాలా చేసాడో తెలుసా పార్టీ నుండి సస్పెండ్ చేసి, కనీసం చివరిగా అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడతాను అంటే మార్షల్స్ ను పెట్టి బయటకు గెంటాడు.మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫోటో లేకుండా చేసాడు చనిపోయిన తర్వాత మాత్రం దండ వేసి ఎనలేని భయభక్తులు చూపించాడు.