తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ యాదమ్మ రాజు( Yadama raju ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట పటాస్ షో( Patas Show ) ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు ఆ తర్వాత అదిరింది, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.
యాదమ్మ రాజుకి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా అతని కామెడీకి బీభత్సమైన అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తూ ఉన్నారు యాదమ్మ రాజు.ఇకపోతే యాదమ్మ రాజు స్టెల్లా( Stella ) అని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తన భార్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన యాదమ్మ రాజు సరదా వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం యాదమ్మ రాజు జబర్దస్త్ షోలో టీం లీడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా యాదమ్మ రాజు భార్య తెల్లవారి యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోని చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అందులో రాజు హాస్పిటల్‌లో కనిపించాడు. కాలికి సర్జరీ జరగ్గా, పెద్ద కట్టుతో కనిపించాడు.భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉంది.
నడవలేని స్థితిలో ఉండగా స్టెల్లా అతనికి సహాయం చేస్తూ కనిపించింది.

అయితే ఆ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలుపలేదు.కానీ రాజుని అలా చూసిన అభిమానులు తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఎనర్జీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉండే రాజుని అలా హాస్పిటల్ బెడ్ పై అలా చూసిన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కొంతమంది ఏం జరిగింది చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ విషయంపై స్టెల్లా రాజు దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.







