ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు సుహాస్ ( Suhas ) ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.
అనంతరం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా విలన్ పాత్రలలో కూడా సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు.అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నటువంటి సుహాస్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఈయన హీరోగా వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా ఎంతో సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్( Ambajipeta Marriage Band ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టినటువంటి ఈయన త్వరలోనే ప్రసన్న వదనం ( Prasanna Vadanam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు .ఈ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించారు అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇలా మీడియా వారు అడిగినటువంటి ప్రశ్నలకు చిత్ర బృందం ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ తన సినిమాల గురించి ప్రశ్నించారు.మీరు నటిస్తున్న సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి దీంతో రెమ్యూనరేషన్ ( Remuneration ) పెంచారని వార్తలు వస్తున్నాయి.ఇందులో నిజం ఎంతుంది అంటూ ఈయన ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సుహాస్ సమాధానం చెబుతూ నేను ప్రతిరోజు 100 రూపాయల తీసుకొని పనిచేస్తూ ఎంతో కష్టపడి ఎదుగుతూ ఇక్కడికి వచ్చాను అందుకే రెమ్యూనరేషన్ పెంచాను నేను కూడా బ్రతకాలి కదా అంటూ ఈయన చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈయన ఒక్కో సినిమాకు సుమారు కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.
.క్రైమ్ న్యూస్
అవీ...ఇవి
ప్రత్యేకం
