తెలుగు ఇండస్ట్రీ( Telugu Industry ) మాత్రమే కాదు తమిళ ఇండస్ట్రీలోనూ ఇంచుమించు ఒకే తరహా సంఘటనలు జరుగుతూ ఉంటాయి.మొదట అవకాశాల కోసం కమెడియన్ రోల్( Comedian Role ) అయినా సరే ఎలాంటి ఇబ్బందు లేకుండా నటిస్తారు.
కానీ ఒక్కసారి స్టార్ డం రావడం మొదలు పెట్టాక హీరో రోల్స్ కోసం అవకాశాలు వస్తాయి.ఒకసారి హీరో అనే అవతారం ఎత్తాక మళ్లీ కమెడియన్ గా నటించడానికి నటులకు చిన్న చూపుగా కనిపిస్తుందో ఏమో కానీ తెలుగులో చాలా మంది కమీడియన్స్ హీరోలుగా మారి తమ కెరీర్ లు ప్రశ్నార్థకంగా చేసుకున్నారు.
సునీల్ నుంచి సప్తగిరి వరకు ప్రతి ఒక్కరు ఈ బాటలోనే నడిచారు.అయితే ఇందుకు తమిళ ఇండస్ట్రీ( Tamil Industry ) కూడా ఏమీ మినహాయింపు కాదు.
సంతానం, వడివేలు, సూరి లాంటి నటులు మొదట్లో కమెడియన్ లుగా అనేక సినిమాల్లో నటించారు.
కానీ ఈ నటులందరికీ ఆ తర్వాత హీరో రోల్స్ వచ్చి ఒకటి రెండు సినిమాలు తీయగానే హాస్య నటులుగా గా నటించడానికి ఇబ్బంది పడ్డారు.దాంతో కెరీయర్ మొదటికే వచ్చింది.ఈ జాబితాలో ఇప్పుడు సూరి కూడా చేరిపోయాడు.
సూరి( Soori )తమిళంలో మంచి కమీడియన్ గా పేరు సంపాదించాడు.విడుతలై( Viduthalai ) అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇటీవలే హీరోగా తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు.
అయితే ఈ సినిమా తర్వాత ఈ నటుడు కేవలం హీరో లేదా లీడ్ రోల్ లో మాత్రమే నటించడానికి సిద్ధపడుతున్నాడు.ఇలాంటి తప్పు చేసిన చాలా మంది హీరోలు తెరమరుగు అయిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇక ఈ దోవలో గౌండమని( Goundamani )లాంటి నటులు ఓకే సారి లీడ్ రోల్ మరియు కామెడీ రోల్ చేసి కెరీర్ ని చివరి వరకు కాపాడుకున్నారు.ఈ మధ్య కాలంలో సునీల్ కూడా తన తప్పు ఎంటో తెలుసుకొని క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న మునుపటి ఫామ్ రావడం లేదు.మరి సూరి కూడా అలా మిగతా కమెడియన్స్ మాదిరిగా కెరీర్ పోగొట్టుకుంటాడా లేక అన్ని రకాల పాత్రల్లో అలరించి తనదైన రీతిలో ముందుకు వెళ్తాడా వేచి చూడాలి.మరో వైపు ఈ ఏడాది కొట్టుక్కాలి అనే మరో సినిమాలో కూడా సూరి లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.1997 లో కెరీర్ మొదలు పెట్టి 2004 వరకు గుర్తింపు లేని పాత్రల్లో నటించిన కూడా అక్కడ నుంచి 2022 వరకు వందల సినిమాల్లో హాస్యం తో నవ్వులు పోయించాడు.