ఆ ఒక్క తప్పు వల్లే ఐరన్ లెగ్ శాస్త్రి ఇబ్బందులు పడ్డారా .. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన ఐరన్ లెగ్ శాస్త్రి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు.ఈయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి కాగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో పురోహితుని పాత్రలలో నటించి ఆ పాత్రలతో ఈ నటుడు మెప్పించారు.

 Comedian Jenny Comments About Iron Leg Shastry Details Here, Comedian Jenny Comm-TeluguStop.com

అప్పుల అప్పారావు సినిమాతో ఐరన్ లెగ్ శాస్త్రి కెరీర్ మొదలైంది.బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఐరన్ లెగ్ శాస్త్రి ఇ.

వి.వి.సత్యనారాయణ సూచనల మేరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు.

మరో టాలీవుడ్ కమెడియన్ జెన్నీ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజుల్లో అనుభవించిన కష్టాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇ.వి.వి.సత్యనారాయణ గారు ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారని ఆయన తెలిపారు.ఇ.వి.వి సత్యనారాయణ జంధ్యాల గారి శిష్యుడు కావడంతో తన సినిమాలలో కామెడీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని ఆయన తెలిపారు.

Telugu Chidala Apparao, Jenny, Appula Apparao, Tollywood-Movie

ఐరన్ లెగ్ శాస్త్రి, చిడతల అప్పారావులను ఇ.వి.వి.సత్యనారాయణ గారు స్టార్స్ ను చేశారని జెన్నీ అన్నారు.ఐరన్ లెగ్ శాస్త్రి స్టార్ అయిన తర్వాత ఆ స్టార్ డమ్ ను ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాలేదని జెన్నీ అన్నారు.

మనతో యాక్ట్ చేసిన వాళ్లు ఆరోగ్యంగా లేకపోయినా, స్టార్ డమ్ కోల్పోయినా బాధగా ఉంటుందని ఐరన్ లెగ్ శాస్త్రి మరణించే సమయానికి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని జెన్నీ కామెంట్లు చేశారు.

Telugu Chidala Apparao, Jenny, Appula Apparao, Tollywood-Movie

ఐరన్ లెగ్ శాస్త్రి డబ్బు విషయంలో జాగ్రత్త పడలేదని జెన్నీ చెప్పుకొచ్చారు.చాలామంది కమెడియన్లు అనారోగ్యంతోనే చనిపోయారని జెన్నీ అన్నారు.ఐరన్ లెగ్ శాస్త్రి గురించి జెన్నీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జెన్నీ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube