ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూ ఉండడంతో పాటు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ కు తాను వెళతానని, అక్కడకు వంశీ రావాలంటూ టిడిపి నేత బుద్ధ వెంకన్న సవాల్ నిన్ననే చేశారు.
అయితే దీనికి వంశీ నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు.వెంకన్న చేసిన సవాల్ కు తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ స్పందించారు.
ఎక్కడో విజయవాడలో కాదు, దమ్ముంటే గన్నవరం రావాలంటూ సవాల్ విసిరారు.నిన్న గన్నవరంలో జరిగిన ఘటన సమయంలో తాను అక్కడ లేనని, ఉంటే అక్కడితో ఆగేది కాదు అంటూ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నోటికి వచ్చినట్లు సిటీలో మాట్లాడితే ఊరుకుంటారేమో గాని గ్రామాల్లో ఊరుకోరని వంశీ ఫైర్ అయ్యారు.” ఉప్పు కారం మేము తింటున్నాం, ఏదన్నా అంటే మేము ఊరుకోము.నా కార్డు డోర్ పట్టుకుని తిరిగిన వాళ్లు నాకే సవాల్ విసురుతున్నారని వంశీ మండిపడ్డారు.కొడాలి నాని నేను ఎవరిని ఏమీ అనమని, ఎవరైనా మమ్మల్ని అంటే ఊరుకోము.
వేరే నియోజకవర్గాల నుంచి ఇంపోర్టెడ్ నాయకులను ఇక్కడకు తీసుకుని వచ్చారు” అంటూ వంశీ ఫైర్ అయ్యారు.

2009లో తాను విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసిన సమయంలో నా సఫారీ కారుకు అటువైపు ఆరుగురు, ఇటువైపు ఆరుగురు వేలాడేవారని, ఆ వేలాడే వారిలో ఒకడు ఇప్పుడు తనను విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలని సవాలు చేస్తున్నాడని, ఎక్కడో పొరుగురు లో ఎందుకు, తాను ఇక్కడే గన్నవరంలోనే ఉంటానని, ఇక్కడకు ఎయిర్ పోర్ట్ కూడా ఉందని, ఇక్కడే తెలుసుకుందామంటూ వంశీ సవాల్ విసిరారు.ఇక ఇప్పటికే బుద్ధ వెంకన్న ఇంటి చుట్టూ పోలీసులను భారీగా మోహరించారు.వెంకన్న నివాసానికి భారీగా టిడిపి శ్రేణులు తరలివస్తుండడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా వంశీ విసిరిన సవాల్ తో బుద్ధ వెంకన్న ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.







