తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కలర్స్ స్వాతి ( Colours Swathi )ఒకరు.ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె 2018 వ సంవత్సరంలో కేరళకు చెందిన వికాస్ వాసు( Vikas Vasu ) అనే పైలెట్ ను పెళ్లి చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు.
అయితే పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఈమె సినిమాలకు కూడా దూరమయ్యారు.అయితే ప్రస్తుతం తిరిగి వచ్చినటువంటి కలర్స్ స్వాతి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఇక ఈమె గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈమె తన సోషల్ మీడియా ఖాతాలో తన భర్తకు సంబంధించిన ఫోటోలు అన్నిటిని డిలీట్ చేయడంతో ఈమె కూడా విడాకులు తీసుకోబోతుందా అన్న సందేహం అందరిలోనూ కలిగింది అయితే ఈ విషయం గురించి ఎన్నో రకాలుగా వార్తలు వస్తున్న కలర్ స్వాతి మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.అయితే తాజాగా ఈమె నటుడు నవీన్ చంద్ర( Naveen Chandra ) తో కలిసి మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా ప్రతినిధులతో సమావేశమై వారి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే ఒక మీడియా ప్రతినిధి నుంచి ఈమె విడాకులకు( Divorce ) సంబంధించిన ప్రశ్న ఎదురయింది.ఇలా విడాకుల గురించి ప్రస్తావనకు రావడంతో కలర్స్ స్వాతి ఈ ఫోటోలపై స్పందిస్తూ ఈ ప్రశ్నకు ఈ కార్యక్రమానికి ఏ మాత్రం సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను అందుకే ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను అంటూ తెలివిగా సమాధానం చెప్పి అసలు విషయాన్ని దాటవేశారు.ఇలా ఈమె విడాకులు వార్తలను ఈ సందర్భంగా ఖండించకపోవడంతో కలర్స్ స్వాతి( Colors Swathi Divorce ) నిజంగానే తన భర్త వికాస్ నుంచి విడాకులు తీసుకుందని అందుకే ఈ ప్రశ్నను దాటవేస్తూ వచ్చారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.