ఆ స్టార్ హీరో పరీక్షల్లో పాసవ్వడానికి నేను కారణం.. స్వాతి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలలోనే నటించినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో స్వాతి ఒకరు.తెలుగమ్మాయి స్వాతి పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.

 Colors Swathi Shocking Comments About Star Hero Details Here Goes Viral In So-TeluguStop.com

స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తుండగా ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు( Month of Madhu ) మూవీ విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు సాయితేజ్ గెస్ట్ గా హాజరు కాగా స్వాతి సాయితేజ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Telugu Colors Swathi, Madhu, Sai Dharam Tej, Soul Satya, Tollywood-Movie

సాయితేజ్( Sai Dharam Tej ) మొదట మాట్లాడుతూ స్వాతి గురించి చెప్పాలంటే మీ అందరికీ కలర్స్ స్వాతి అని నాకు మాత్రం స్వాతిగాడు అని సాయితేజ్ అన్నారు.కాలేజ్ రోజుల నుంచి స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్ అని సాయితేజ్ కామెంట్లు చేశారు.స్వాతి నా లైఫ్ లో కలర్స్ స్వాతిగా మొదలై స్వాతి అయిందని ఆ తర్వాత స్వాతిగాడు అయిందని సాయితేజ్ చెప్పుకొచ్చారు.మంత్ ఆఫ్ మధు సినిమాతో స్వాతికి సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నానని సాయితేజ్ తెలిపారు.

Telugu Colors Swathi, Madhu, Sai Dharam Tej, Soul Satya, Tollywood-Movie

ఆ తర్వాత స్వాతి( Colors swathi ) మాట్లాడుతూ నేను, సాయితేజ్ కలిసే చదువుకున్నామని సినిమాల్లోకి నేను ముందు రావడం వల్ల నేను తనకంటే పెద్దదానినని మీరు భావిస్తూ ఉండవచ్చని కానీ మా ఇద్దరి వయస్సు ఒకటేనని స్వాతి అన్నారు.ఒకే కాలేజ్ లో మేము డిగ్రీ చేశామని పరీక్షల్లో నేను చూపిస్తేనే సాయితేజ్ పాస్ అయ్యాడని స్వాతి చెప్పారు.స్వాతి చెప్పింది నిజమేనని సాయితేజ్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు.సత్య అనే ప్రాజెక్ట్ ను( The Soul Of Satya ) నేను, సాయితేజ్ కలిసి చేశామని తేజూ నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్ సిస్టంలా ఉంటూ వస్తున్నాడని స్వాతి కామెంట్లు చేశారు.

స్వాతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.సాయితేజ్ స్వాతి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube