గ్రహాంతర వాసులు ఈ విశ్వంలో ఉన్నారా? ఉంటే వారు ఎక్కడ ఉన్నారు? మనుషుల కంటే ఈ ఏలియన్స్ ఎక్కువ అడ్వాన్స్ అయ్యారా? వీరు ఎప్పుడైనా మన ప్రపంచంలోకి అడుగు పెట్టారా? అనే ప్రశ్నలు సామాన్యుడిని మాత్రమే కాదు శాస్త్రవేత్తల మెదళ్లను కూడా ఎప్పటి నుంచో తొలిచేస్తున్నాయి.అయితే ఈ క్రమంలో చాలామంది తమకు ఎగిరే పళ్లాలు (యూఎఫ్ఓలు) కనిపించాయని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.
కానీ నిజంగా ఈ ఏలియన్స్ ప్రాణాలు కెమెరాకి చిక్కినట్లు ఎక్కడా క్లారిటీ లేదు.శాస్త్రవేత్తలు కూడా ఇప్పటివరకు వీటిపై స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏలియన్స్ కి సంబంధించి కొన్ని వీడియోలు,ఫొటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.తాజాగా యూఎఫ్ఓలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఓ ఫోటో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ ఫొటో యూఎఫ్ఓ ఆనవాళ్ళను సూచిస్తోంది అంటూ కొన్ని థియరీ తెర మీదకు కూడా వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.
అమెరికా, అలస్కా రాష్ట్రంలోని ఓ పర్వత ప్రాంతంలో ఒక మేఘం చాలా వింతగా కనిపించింది.ఈ మేఘం చూసేందుకు ఆకాశం పై నుంచి ఏదో కిందికి జారిపడినట్లుగా ఉంది.
భూమి మీద ఇలాంటి మేఘం ఏర్పడటం బహుశా ఇదే తొలిసారేమో.అందుకే దీన్ని చూసి స్థానికులు అబ్బురపడ్డారు.
ఈ ప్రాంతంలో యూఎఫ్ఓ పడి ఉంటుందేమోనని వారు భావిస్తున్నారు.అలానే దీనిని వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇప్పుడు అవి కాస్త వైరల్ గా మారాయి.దీన్ని చూసిన నెటిజన్లు యూఎఫ్ఓ నిజంగానే కూలిందా లేదా అనే చర్చ చేయడం మొదలుపెట్టారు.
అయితే ఈ మేఘం అధికారుల దృష్టికి రాగా వారు దీన్ని పరిశీలించారు కానీ అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.మరి ఈ మేఘం ఏర్పడడానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.







