కొన్ని జంతువుల మధ్య జాతి వైరం ఉంటుంది.అవి ఎప్పుడైనా ఒకదానికొకటి ఎదురు పడినప్పుడు పోట్లాడుకుంటాయి.
సోషల్ మీడియాలో ఇలాంటి జంతువుల మధ్య జరిగే ఫైట్లు మనకు దర్శనమిస్తున్నాయి.ఆ వైరల్ వీడియోలను చూసినప్పుడు నెటిజన్లు షాక్ అవుతారు.
వీటిలో ఎక్కువ భాగం పాముకు సంబంధించిన వీడియోలు ఉంటాయి.ముఖ్యంగా ముంగిస-పాము మధ్య జరిగే పోరాటం చాలా భీకరంగా ఉంటుంది.
చివరికి పాములపై ముంగిసలు పై చేయి సాధిస్తాయి.ఈ పోరాటంలో బుసలు కొట్టిన పాములను ముంగిసలు చంపేస్తాయి.

ఇలాంటి కోవకు చెందిన పాము-ముంగిస మధ్య జరిగిన ఫైట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో పాము-ముంగిస ఒకదానికొకటి ఎదురు పడతాయి.పాము కోపంగా బుసలు కొడుతూ ముంగిసపై విరుచుకు పడుతుంది.ఆ ముంగిస కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పాముపై పోరాటానికి దిగుతుంది.ఈ రెండూ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటాయి.పాము దాడి చేసినప్పుడు, ముంగూస్ వెనక్కి తగ్గుతుంది.

కాని వెంటనే ఆ ముంగిస కూడా పాముపై దాడి చేయడం ప్రారంభిస్తుంది.వీడియో చూస్తే, రెండింటి మధ్య లోతైన శత్రుత్వం ఉన్నట్లు అనిపిస్తుంది.పాము, ముంగిస మధ్య జరిగే ఈ పోరాటం చూపరులను అలరిస్తుంది.అయితే పాము ధాటికి ముంగిస కొంచెం వెనక్కి తగ్గుతుంది.చివరికి ఆ పాము అక్కడి నుంచి వెళ్లి పోతుంది.ఈ వీడియోను animals_powers అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.ఇప్పటికే ఈ వీడియోకు 1.32 లక్షల వ్యూస్ దక్కాయి.వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.







