విశాఖ పర్యటనలో సీఎం ఔదార్యం

కాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభించి సీ హారియర్‌ ప్రారంభోత్సవానికి వెళుతూ దారిలో గమనించి కాన్వాయ్‌ ఆపి అనారోగ్య బాధితుడిని పరామర్శించిన సీఎం( CM jagan ) ఆర్ధిక సాయం, మెరుగైన వైద్యం అందిస్తామని హామీగుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న వానపల్లి చరణ్ సాయి( Charan Sai ) మణికంఠకు మెరుగైన వైద్యం అందిస్తామని సీఎం భరోసా కల్పించారు.గురువారం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రికి ఆరిలోవ రోడ్డులో ముఖ్యమంత్రి సహాయం నిమిత్తం తల్లి వానపల్లి పార్వతి, (ఆరిలోవ, విశాఖపట్నం రూరల్ మండలం) తన కుమారుడు వానపల్లి చరణ్ సాయి మణికంఠకు హార్ట్ పేషెంటని, సికెల్ సెల్ వ్యాధికి గురయ్యాడని ముఖ్యమంత్రికి వివరించగా ముఖ్యమంత్రి శ్రీ వై.

 Cm's Generosity During His Visit To Visakha , Cm Ys Jagan , Visakhapatnam, Vis-TeluguStop.com

యస్.జగన్ స్పందించి ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించి, భవిష్యత్తులో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం నుండి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు.

రూ.1 లక్ష ఆర్ధిక సహాయం ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున వానపల్లి చరణ్ సాయి మణికంఠకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలన్న సూచనలతో చరణ్ సాయి మణికంఠ తల్లి పార్వతి కి లక్ష రూపాయల చెక్కును ఆరిలోవలో వారి ఇంటికి వెళ్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube