త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ మేరకు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి( Ranjith Reddy)తో పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలు మరియు ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు హాజరుకానున్నారు.
ఇందులో ప్రధానంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దిశానిర్దేశం చేయనున్నారు.
దాంతో పాటుగా ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుందన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సభా ఏర్పాట్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )నేతలకు పలు సూచనలు చేయనున్నారని సమాచారం.