తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆరు గ్యారెంటీల ఫైల్ పై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు.అలాగే ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ మరో ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి రెండో సంతకం చేశారు.
ఆరు గ్యారెంటీలు.: 1.మహాలక్ష్మీ పథకం: మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థికసాయం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
– 2.రైతు భరోసా.: ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, అలాగే వరి పంటకు రూ.500 బోనస్.
-3.గృహజ్యోతి.: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
-4.ఇందిరమ్మ ఇండ్లు.: ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు., ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం
-5.యువ వికాసం.: విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డుతో పాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
-6.చేయూత.: రూ.4000 నెలవారీ ఫించను మరియు రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా
.