తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీనిలో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ( Aarogya Sri ) పరిమితి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మరోపక్క పాలనపరంగా ప్రక్షాళన చేస్తున్నారు.
దీనిలో భాగంగా గత ప్రభుత్వ నియామకాలను రద్దు చేస్తూ ఉన్నారు.ఇదే సమయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కాగా ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు.ఈ సమావేశం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుందని సమాచారం.ఈ సమావేశంలో ముఖ్యంగా వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలు,( Six Guarantees ) పాలనయంత్రంగాన్ని గ్రామస్థాయికి తీసుకుని పోయే ప్రజాపాలన కార్యక్రమాలపై.సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు.
అంతేకాకుండా డివిజన్, మండల, గ్రామస్థాయిలలో ప్రజావాణి నిర్వహించడంపై కూడా చర్చించనున్నారు.ఇక ఇదే సమావేశంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నత అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.