ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో( Bhadrachalam ) పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) సీఎం పదవి వచ్చేదా అని ప్రశ్నించారు.తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా పంపిస్తే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరిస్తారు.
కానీ కాంగ్రెస్( Congress ) జాబితాను గవర్నర్ ఆమోదిస్తారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర( Telangana State ) పరువు తీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.బీజేపీని నిలువరించగలిగేది కేవలం బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు.