తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హస్తినకు వెళ్లిన ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
ఈ మేరకు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు మరియు రవాణాశాఖ మంత్రి గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో పాటు కేంద్ర రైల్వేశాఖ మంత్రితో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

ఇందులో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.1400 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం.ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం నిధుల వేటపై దృష్టి సారించింది.అనంతరం పార్టీ హైకమాండ్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.







