తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) క్రేజ్ పెరుగుతోంది.ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా నిలిచారు.
ప్రత్యర్థులపై మాటాల తూటాలు పేలుస్తూ.తనదైన శైలితో ప్రజలను రేవంత్ రెడ్డి అమితంగా ఆకర్షిస్తారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందింది.ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ పీసీసీల నుంచి రేవంత్ రెడ్డి ఆహ్వానాలు అందాయన్న సంగతి తెలిసిందే.
తాజాగా తమిళనాడు, బీహార్, గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.ఇందులో భాగంగా ఇవాళ, రేపు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పోటీ చేస్తున్న వయనాడ్ లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్( K C Venugopal ) పోటీ చేస్తున్న అలప్పుజ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.ఇక ఎల్లుండి నుంచి మే 11 వరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొత్తం 50 సభలతో పాటు 15 రోడ్ షోలు నిర్వహించే విధంగా పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది.