పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి అరెస్టు విషయంలో తాను చేసిన ఆరోపణలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఒక రాజకీయ నాయకునిలా స్పందించారని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ విమర్శించారు.తాను కడప సెంట్రల్ జైల్లో బీటెక్ రవి ని కలిసిన తర్వాత మాత్రమే స్పందించి విషయాన్ని పత్రికలకు, మీడియాకు తెలియ చేశానని అన్నారు.
దీనిపైన ఎస్పీ తనకు లీగల్ నోటీసులు పంపితే దానికి సరైన సమాధానం చెబుతారని అన్నారు.
కేంద్ర హోం శాఖకు ఇక్కడ జరిగిన విషయాన్ని తెలియజేశారని తెలిపారు.
రవిని కిడ్నాప్ చేసి అక్రమంగా వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు చూపించారని వివరించారు.అశోక్ రెడ్డి అనే ఒక సీఐ జిల్లాను శాసిస్తున్నాడని అతనిపై కూడా కఠినంగ చర్యలు తీసుకోవడానికి తాము ఫిర్యాదు చేశామని అన్నారు.
ఎస్ పి బీటెక్ రవి అరెస్టు విషయంలో తాను అక్రమంగా పక్షపాతంగా వ్యవహరించలేదని ప్రమాణం చేయాలని అన్నారు.