తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా ముందుగా ఎల్లమ్మగుట్టకు చేరుకోనున్న ఆయన.
టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.తర్వాత నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలతో జిల్లా కేంద్రం అంతా గులాబీమయంగా మారింది.







