మళ్లీ బీఆర్ఎస్ ఊసెత్తని సీఎం కేసీఆర్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం ఏమిటి ? కేంద్రం పై పోరాటానికి సిద్ధమవుతున్నారా ? సమావేశాలు జరగ కుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారా ?టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విపక్షాలన్నిటీతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కేసీఆర్ చెబుతున్నారు.అయితే కేసీఆర్ కేంద్రం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ఇరుకున పెడదామని ప్రయ్నతించినా ఆయనే బోల్తా పడుతున్నారని, ఈసారి కూడా అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

 Cm Kcr Who Did Not Accept Brs Again , Cm Kcr , Brs, Telangana , Politics-TeluguStop.com

18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.ఉభయ సభల్లోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.అయితే ఇప్పడు ఈ విషయం చర్చనీయాంశమైంది.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని చెబుతారు.

తరువాత మళ్లీ కొన్ని రోజులకు సైలెంట్ అయిపోతారు.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, ఫెడరల్, సెక్యులర్ శక్తులన్నిటీని ఏకం చేస్తానని దేశ వ్యాప్తంగా టూర్లు వేస్తారు.

అయితే కేసీఆర్ ఎన్ని చెప్పినా జాతీయ స్థాయి నేతలెవ్వరూ అయనకు అనుకూలంగా స్పందించడంలేదు.కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెడతానని ప్రకటించారు.తరువాత సైలెంట్ అయిపోయారు.ఇప్పడు ఏకంగా టీఆర్ఎస్ నే జాతీయ పార్టీగా మారుస్తానని ప్రకటించారు.

ఇటీవల కాలంలో బీజేపీ తెలంగాణ పై ఫోకస్ పెట్టింది.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్ లో నిర్వహించింది.ఈనేపథ్యంలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు.అందుకే ఫ్రస్టేషన్ తో ఉన్న కేసీఆర్ రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Telugu Cm Kcr, Cm Kcr Brs, Telangana-Political

ఇలా రోజుకో ప్రకటన చేసే కేసీఆర్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరో సారి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని టీఆర్ఎస్ ఎంపీలకు చెప్పారు.ఉభయ సభల్ని స్థంభింప చేయాలని చెప్పారు.విపక్షాల చెందిన నేతలతో, పలువురు ముఖ్యమంత్రులతో కూడా కేసీఆర్ మాట్లాడారు.అయితే వారెవరూ టీఆర్ఎస్ తో కలిసి వచ్చేందుకు అంత సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.కేసీఆర్ ప్రకటనలు చూసి సొంత పార్టీకి చెందిన ఎంపీలే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ రోజుకో ప్రకటన చేస్తూ ఆయనకు ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటున్నారని టీఆర్ఎస్ అనుకుంటున్నట్టు సమాచారం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube