బడుగు, బలహీన వర్గాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.తెలంగాణలో కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం చేపట్టిందని పేర్కొన్నారు.రూ.13 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారని తెలిపారు.మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు.ఈ క్రమంలోనే జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు.రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మారతాయని తెలిపారు.ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.