ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా ఇవాళ సీఎం జగన్ వైసీపీ మ్యానిఫెస్టోపై కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం( Tadepalli CM camp office )లో సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు.

నవరత్నాలుతో పాటు కొత్త పథకాలపై కూడా వైసీపీ ( YCP )అధిష్టానం సమాలోచనలు చేయనుందని తెలుస్తోంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మ్యానిఫెస్టోలో పెట్టే యోచనలో సీఎం జగన్( CM Jagan ) ఉన్నారని సమాచారం.అదేవిధంగా మహిళల కోసం సరికొత్త పథకాలు అమలుపై చర్చించే అవకాశం ఉంది.కాగా ఎన్నికల షెడ్యూల్ లోపే మ్యానిఫెస్టోను ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు.







