ఛలో పోలవరం.. ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ( Polavaram )ఎప్పుడు పూర్తవుతుందా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.ఏళ్ళు గడుతున్న ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు.

 Cm Jagan's Focus On Polavaram, Cm Jagan ,  Polavaram , Ycp, Bjp, Central Govt ,-TeluguStop.com

తాము అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని ఎన్నికల ముందు చెప్పడం.తీర ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రాజెక్ట్ ఊసే మర్చిపోవడం.

ఇది ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వ పరిస్థితి.ప్రాజెక్ట్ కు జాతీయ హోదా లభించినప్పటికి ఇంకా నిర్మాణ దశలోనే ఉండడం.

ప్రభుత్వాల అసమర్థత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.గత ప్రభుత్వ హయంలో పోలవరంకు సంబంధించి అడపా దడపా పనులు జరుగుతూ ఉండేవి.

కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పోలవరం కు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ను కూడా బయటకు ఇవ్వడం లేదు.

Telugu Ambati Rambabu, Ap, Central, Cm Jagan, Polavaram, Ys Jagan-Politics

2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని కుండ బద్దలు కొట్టిన గత ఇరిగేషన్ మంత్రి.ఆ ఊసే ఎత్తకుండా పదవి నుంచి దిగిపోయారు.ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి( Ambati Rambabu ) పోలవరంపై ఇదిగో అదిగో అంటూ గాల్లో చిత్రం గీసే ప్రయత్నం చేస్తున్నారే తప్పా ప్రాజెక్ట్ కు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వడం లేదు.

మరోవైపు ప్రాజెక్ట్ సంబంధించిన అన్నీ నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.ఎలా ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పా ప్రాజెక్ట్ మాత్రం పూర్తి చేయడం లేదు.

Telugu Ambati Rambabu, Ap, Central, Cm Jagan, Polavaram, Ys Jagan-Politics

ఇక ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు జరగడంతో ముఖ్యమంత్రి జగన్ రేపు పోలవరం పయనమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ లోయర్, అప్పడర్ కాఫర్ ద్యామ్ లను పరిశీలించి.ఇంతవరకు జరిగిన పనులపై అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్న పనులపై నివేధికను కోరే అవకాశం ఉంది.అలాగే నిర్వాసితులకు పరిహారం వంటి విషయాలపై కూడా జగన్ ( CM Jagan )ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఇక డ్యామ్ ఎత్తు తగ్గించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.మరి దీనిపై కూడా జగన్ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి కేంద్రం నుంచి నిధుల విడుదలతో పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ పనులు పునః ప్రారంభం అయ్యి వేగం పెరిగే అవకాశం ఉంది.ఇక ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణం 2025 జూన్ నాటికి టార్గెట్ గా పెట్టుకుంది.

మరి అప్పటిలోగా ఏపీలో అధికారం మారుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube