క్యాంపు కార్యాలయంలో తుపానుపై 8 మంది జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి:క్యాంపు కార్యాలయంలో తుపానుపై 8 మంది జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌.పాల్గొన్న పలు శాఖలకు చెందిన అధికారులు.

 Cm Jagan Video Conference With 8 District Collectors On Michaung Cyclone Details-TeluguStop.com

సీఎం జగన్ కామెంట్స్.తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి.

హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది.తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది.

తుపాన్‌ పట్ల అప్రమత్తంగాఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అనుభవం ఉంది.బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

గంటకు 110 కి.మీ.వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.౭వ తేదీనాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి.

ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం.అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం.

వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు.ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది.

పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు.ఆమేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి.

కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది.నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం.6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం.పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు.దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి.యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి.తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది.

అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అంత్యంత ప్రాధాన్యతాంశం.తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు.అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి.

ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయి.

Telugu Collectors, Ap Cyclone, Cm Jagan, Conference-Latest News - Telugu

ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ.విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి.ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం.ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు.ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి.

ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి.ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి.

సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి.

మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి.కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు.

క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి.

ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి.క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి.

ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి.గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి.బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి.

పరిహారాన్ని సకాలంలో అందించాలి.తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి.

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి.ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి.

జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి.గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి.

తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి.పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి.

విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి.సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి.తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలి.నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.

కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను.బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి.

తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను.సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు.

సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి.ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు.

డబ్బులు ఇంకా అవసరమైతే.వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను.

ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం.ఏం కావాలన్నా వెంటనే అడగండి.

సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube