నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత సీఎం జగన్ పుట్టినరోజు.( CM Jagan Birthday ) దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తమ అధినేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.
ఇదే సమయంలో ప్రధాని మోదీతో( PM Modi ) పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మహేష్ బాబు, నాగార్జున ఇంకా చాలామంది ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నేతలు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.మరి ముఖ్యంగా వైసీపీ కుటుంబం సభ్యులు( YCP Family ) వారి ప్రేమ ఆప్యాయలతో ఈ రోజును ప్రత్యేకంగా మార్చారని.సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇక ఇదే సమయంలో తన పుట్టినరోజు నాడు వాలంటీర్లకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు 5000 రూపాయల వేతనం ఇస్తున్నారు.
తాజా నిర్ణయంతో జనవరి నెల నుంచి 5750 రూపాయలు వేతనం వాలంటీర్లకు ప్రభుత్వం ఇవ్వనుంది.