టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్( CM Jagan ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదన్నారు.
చంద్రబాబు గతంలో ఏనాడైనా ఒక్క రూపాయైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu ) పేరు చెప్తే వంచనలు, దగా గుర్తుకొస్తాయని తెలిపారు.
అలాగే దత్త పుత్రుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) మ్యారేజ్ స్టార్ అని విమర్శించారు.మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పేదవారిపై యుద్ధానికి వస్తున్నారని తెలిపారు.

2014 లో కూడా ముగ్గురు ఒక్కటయ్యారన్న సీఎం జగన్ గతంలోని టీడీపీ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని మండిపడ్డారు.2014లో ఇచ్చిన ఏ హమీని చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు.మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ముగ్గురు వస్తున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే రంగురంగుల మ్యానిఫెస్టోతో మోసపోవద్దన్న సీఎం జగన్ తనకు మోసం చేయడం చేతకాదని వెల్లడించారు.మీ ఇంట్లో మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని కోరారు.







