జీ20 సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) జీ20 సదస్సులో ఈరోజు సాయంత్రం పాల్గొన్నారు.ఈ సందర్భంగా జి-20( G-20 ) రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్నిఉద్దేశించి మాట్లాడిన సీఎం శ్రీ వైయస్.

 Cm Jagan Key Remarks At G20 Conference , Vishakapatnam, G20 Conference, Ap Cm Ys-TeluguStop.com

జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నాను.

ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం.మేం అధికారంలోకి వచ్చాక.30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం.22 లక్షల ఇళ్లు కడుతున్నాం.ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

దీనిపై సరైన చర్చలు జరిపి సూచనలు ఇవ్వాలని కోరుతున్నాను.ఇటువంటి మంచి పనిలో మార్గ నిర్దేశకత్వం ఎంతో అవసరం.ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది పేదల ఇళ్లకు మంచి చేకూరుతుంది.

దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి.సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి.

ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలి.మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని జగన్ ప్రసగించారు.

ఇక ఇదే సదస్సులో సీఎం జగన్ విందులో పాల్గొని జీ20 ప్రముఖులతో భేటీ కాబోతున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో.

స్థానిక వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube