నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.నెల్లూరు సిటీ ఇంఛార్జ్, జిల్లా అధ్యక్షుడి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే సిటీ ఇంఛార్జ్ వినోద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.
క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని సమాచారం.
అయితే తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదని వినోద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో వినోద్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.







