టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాయి.మరి కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇవే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరికొన్ని అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పరంగా మరింత యాక్టివ్ గా ఉంటూ వర్ష సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్,కోలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఒక వార్త ఇక చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే సమంత ప్రతి సినిమాకు డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ చిన్మయి మద్య గొడవలు వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.కాగా వీరిద్దరూ ప్రాణ స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే.
అటు ప్రొఫెషనల్ గా కానీ ఇది పర్సనల్ గాని ఇద్దరూ ఒకే రకంగా ఉంటారు.అయితే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ వార్తలు వినిపించడంతో ఆవర్తలపై గతంలో స్పందించిన చిన్న అటువంటిది ఏమీ లేదు అంటూ ఆ వార్తలను కొట్టి పడేసింది.
కానీ తాజాగా సమంత వ్యవహారంతో మరొకసారి వీరి మధ్య విభేదాలు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సమంత యశోద సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.కదా ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతాను అని సమంత అంటుండగా మూవీ మేకర్స్ మాత్రం సమంతకు చిన్మయితో డబ్బింగ్ చెప్పించాలి అనుకుంటున్నారట.కానీ సమంత మాత్రం అందుకు నిరాకరించి తానే డబ్బింగ్ చెబుతాను అని అంటుందట.
అయితే ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సమంత చిన్మయికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే సమంత ఆ విషయంలో కన్విన్స్ అవడం లేదు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి ఈ విషయంపై చిన్మయి కానీ సమంత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.