మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లుక్ పై ఇప్పుడు అందరిలో కన్ఫ్యూజన్ నెలకొనింది.అందుకు కారణం ఈయన లుక్ అనే చెబుతున్నారు.
చరణ్ తన లుక్ తోనే కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.మరి రామ్ చరణ్ లుక్ విషయంలో క్లారిటీ ఏంటంటే.
ఇటీవలే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తో అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రెజెంట్ రామ్ చరణ్ భారీ లైనప్ ను సెట్ చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ రెడీ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ అతి త్వరలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లారు.శుక్రవారం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలోని ప్రేజెంటర్స్ లో చరణ్ ఒకరిగా వ్యవహరించ నున్నారు.

అంతేకాదు అమెరికా ఫేమస్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కూడా ఈయన ప్రెజెన్స్ ఉండనుంది.మరి ఈ సందర్భంగా న్యూయార్క్ లోని ఫ్యాన్స్ ను కలిసి చరణ్ వారితో సూపర్ సెల్ఫీ దిగాడు.ఈ పిక్స్ బయటకు వచ్చినప్పటి నుండి అందరిలో ఒకటే చర్చ జరుగుతుంది.అది ఏంటంటే.చరణ్ న్యూయార్క్ కు వెళ్లే సమయంలో కూడా స్వామి మాలలోనే ఉన్నారు.

అయితే అక్కడ ఈవెంట్స్ మొత్తం ఈ లుక్ లోనే కనిపిస్తారు అని అనుకుంటే ఇప్పుడు చరణ్ మాములు లుక్ లోకి వచ్చేసారు.సూట్ వేసుకుని షూస్ తో కనిపించారు.మాలలో ఉంటే అలా ఎలా వేస్తారు అని అందరికి డౌట్ రావడంతో ఇప్పుడు దీనిపై క్లారిటీ తెలుస్తుంది.
చరణ్ నిన్నటితో 21 రోజుల దీక్ష అక్కడ ముగించడంతో ఈ రోజు నుండి మాములు డ్రెస్సింగ్ లోకి మారిపోయారత్.దీంతో ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.







