పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’( OG ).ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్( Young director Sujith ) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో, పోస్టర్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా టాప్ క్లాస్ లో ఉన్నాయి.అంతే కాకుండా ఈ సినిమాలో పని చేసే ప్రతీ ఒక్కరు కూడా టాలీవుడ్ నుండి రాబోతున్న మరో పెద్ద సంచలనాత్మక పాన్ ఇండియన్ చిత్రం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి హద్దులే ఉండవు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో, అంతకు మించి చూపించే పనిలో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్.ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోవడానికి మరో కారణం సినిమాటోగ్రఫీ.

గ్లిమ్స్ వీడియో చూస్తే సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్( Cinematographer PS Vinod ) పనితనం ఎలాంటిదో అర్థం అవుతుంది.అద్భుతమైన షాట్స్ తో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని అబ్బురపరిచారు.పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘భీమ్లా నాయక్’ కి కూడా పీ ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు.అయితే ఇప్పుడు ఆయన ‘ఓజీ’ చిత్రం నుండి కమల్ హాసన్ మరియు మణిరత్నం సినిమాకి షిఫ్ట్ అయ్యాడు.
రీసెంట్ గానే ఈ చిత్రం చెన్నై లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది.మణిరత్నం తో సినిమా అంటే కనీసం 9 నెలలు డేట్స్ కేటాయించాలి.అంటే 9 నెలల వరకు పీఎస్ వినోద్ ‘ఓజీ’ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టడా?, ఓజీ సినిమాకి ప్రధానమైన బలాల్లో ఒకడిగా నిల్చిన వినోద్ ఈ సినిమా కి దూరం అయితే పరిస్థితి ఏమిటి అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.అయితే భయపడాల్సిన అవసరం ఏమి లేదని, వినోద్ కి ఇలా ఒకే సమయం లో రెండు మూడు సినిమాలు చెయ్యడం కొత్తేమి కాదంటూ ‘ఓజీ’ మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

ప్రస్తుతం రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ సినిమాకి కూడా డేట్స్ కేటాయించే పరిస్థితిలో లేరని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.అయితే ఓజీ చిత్రానికి మాత్రం ఒక 15 రోజుల డేట్స్ ఇస్తానని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చాడట.మిగిలిన ఆర్టిసుల డేట్స్ మరియు సినిమాటోగ్రాఫర్ వినోద్ గారి డేట్స్ ని చూసుకొని డిసెంబర్ రెండవ వారం నుండి కొత్త షెడ్యూల్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.