2 కోట్లతో సిద్ది వినాయకుడి గుడి.. ఆశ్చర్య పరిచిన క్రైస్తవ భక్తుడు !

కొంతమంది ఉన్నత స్థాయికి ఎదిగి వ్యాపారంలో కోట్లు సంపాదించినా తర్వాత పుట్టిన గడ్డను పెరిగిన నేలను మర్చిపోతారు.

కానీ ఒక వ్యాపారి మాత్రం ఎంత ఉన్నత స్థానంలో ఎదిగి కోట్లు సంపాదించినా పుట్టిన గడ్డ మాత్రం మర్చిపోలేదు.

తన తల్లిదండ్రుల కోరికను తీర్చాడు.తను పెరిగి పెద్దయిన ఊరిలో 2 కోట్లు పెట్టి సిద్ది వినాయకుడి గుడి కట్టించాడు.

అతడు క్రైస్తవ భక్తుడు అయినప్పటికీ మతం తో సంభంధం లేకుండా తాను తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం గుడిని కట్టించి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.కర్ణాటక రాష్ట్రము లోని ఉడిపి జిల్లా శీర్వా లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎఫ్ నజరేత్ అనే వ్యక్తి పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ముంబయి లో ఉద్యోగం చేసేందుకు వెళ్లి పోయాడు.కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసిన అతడికి తృప్తిగా అనిపించలేదు.

Christian Man Builds Ganesha Temple In Karnatakas Udupi Spends Over 2 Crore For
Advertisement
Christian Man Builds Ganesha Temple In Karnatakas Udupi Spends Over 2 Crore For

ఇలా కాదు అని అతడే స్వయంగా బిజినెస్ స్టార్ట్ చేసాడు.అతడు ముంబై వెళ్లి ఇప్పటికి 55 సంవత్సరాలు అవుతుంది.అతడు క్రైస్తవడు అయినా కూడా వినాయకుడిని కూడా నమ్ముతాడు.

అందుకే తన సొంత ఊరిలో సిద్ది వినాయకుడి గుడి కట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.

Christian Man Builds Ganesha Temple In Karnatakas Udupi Spends Over 2 Crore For

36 ఇంచుల వినాయకుడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు.అంతేకాదు ఆ ఆలయంలో పూజ చేసే పూజారి కోసం కూడా పక్కనే ఒక ఇంటిని కూడా నిర్మించాడని అతడి స్నేహితుడు తెలిపాడు.ఆలయం పనులు ఎప్పుడో పూర్తి అయినా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ మధ్యనే ఆలయ ప్రతిష్ట మహోత్సవం చాలా బాగా నిర్వహించారు.క్రైస్తవ భక్తుడు అయినా కూడా మతంతో పని లేకుండా వినాయకుడి గుడి కట్టించి అందరి చేత ప్రశంసలు అనుకున్నాడు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు