2002లో విడుదలైన సూపర్ నేచురల్ యాక్షన్ మూవీ “బాబా( Baba )” ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.రజనీకాంత్ తన సొంత బ్యానర్ అయిన లోటస్ ఇంటర్నేషనల్‌పై దీన్ని ప్రొడ్యూస్ చేశాడు.
ఈ మూవీ ఫ్లాప్ అయినందుకు గాను రజినీ కొంతమేర నష్టాలను తన సొంతంగా పూడ్చాడు.సురేష్ కృష్ణ( Suresh Krishna ) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఆఫర్ చేశాడు. ఛోటా కె నాయుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపాడు.
ఛోటా కె నాయుడు మాట్లాడుతూ “ఈ సినిమాకి తరుణ్ డ్యాన్స్ మాస్టర్.ఆయన ఒక పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు అయితే నేను రజనీకాంత్ ( Rajinikant )సార్ షర్ట్ మార్చాలని చెప్పాను.అప్పుడు తరుణ్ పాన్ పరాగ్ తింటున్నాడు.
నా మాటలు విని ఏ? అంటూ ప్రశ్నించాడు.చొక్కాకి మొత్తం చెమట పట్టింది, ఇక్కడ అంతా అసహ్యంగా కనిపిస్తోంది.
కచ్చితంగా మారవాల్సిందే అని నేను మరో సారి చెప్పాను అప్పుడు ‘నా వల్ల కాదు, వెళ్లి నువ్వు అడుగు‘ అంటూ తరుణ్ రిప్లై ఇచ్చాడు.అంతేకాదు ‘రజనీకాంత్ సార్ చేత షర్ట్ మార్పించు.
ఈ పాటకు నాకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ వస్తుంది.అదంతా కూడా నీకే ఇచ్చేస్తా’ అని తరుణ్ అన్నాడు.
“కానీ నేను భయపడలేదు.డైరెక్ట్ గా రజనీకాంత్ సార్ వద్దకు వెళ్లి ‘సార్ షర్టు బాగోలేదు’ అని చెప్పడం పూర్తయ్యేలాగా ఆయన నన్ను నిశ్శబ్దం చేశారు.షాట్ రెడీ అంటూ కోపంగా వెళ్ళిపోయారు.అందరూ నన్నే చూశారు.అప్పుడు నాకు తల కొట్టేసినట్లుగా అనిపించింది.తర్వాత ప్యాకప్ చెప్పడం జరిగిపోయింది ఎప్పుడు ఆయన స్టిఫ్ గా షేక్ అండ్ ఇచ్చేవారు.
లేదంటే సెల్యూట్ చేయడమో చేసేవారు కానీ ఆ సమయంలో మాత్రం ఇద్దరం కూడా ఏమీ చెప్పుకోలేదు.ఇంటికి వెళ్ళిపోయాము.
కొంతసేపటికి నాకు రజనీ సార్ డ్రింక్ పంపించారు తర్వాత ఫోన్ చేసి సాంగ్ చేసేటప్పుడు తనకు చాలా భయం వేస్తుందని అన్నాడు. డ్యాన్స్ రాదు కాబట్టి అలా భయం కలుగుతుందని పేర్కొన్నాడు.‘ఆ టెన్షన్‌లో డ్రెస్ చేంజ్ చేయమని అడిగినప్పుడు కాస్త కోపంగా మాట్లాడాను.ఏమీ అనుకోవద్దు ఐ యాం సారీ’ అని కూడా చెప్పాడు” అని చోటా కె నాయుడు తెలిపాడు.
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ చిన్న క్రూ మెంబర్స్ కి రజనీకాంత్ సారీ చెప్పానని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ సాంగ్ సమ్మర్ లో షూట్ చేయడం వల్ల చెమట బాగా పట్టేసిందట.
నిజానికి ప్రతి సాంఘిక రజినీకాంత్ కోసం నాలుగైదు షర్ట్స్ కుట్టి ఉంచుతారు.వేసిన చొక్కా నేను మళ్ళీ ఉతికి వేస్తే ఫ్రెష్‌నెస్ పోతుంది కాబట్టి ఎప్పుడూ కొత్త షర్ట్స్ వాడేవారు.
అయితే చోటా కే నాయుడు షర్ట్ మార్చమని అడిగే సమయానికి లంచ్ అయిపోయింది.తర్వాత రజనీకాంత్ టచ్ అప్ చేసుకుంటున్నాడట.
ఏదేమైనా ఈ చిన్నపాటి మనస్పర్ధలు వెంటనే తొలగిపోయాయి.