ప్రముఖ డాన్స్ మాస్టర్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) గురించి పరిచయం అవసరం లేదు.ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 1500 పాటలకు కొరియోగ్రఫీ అందించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అదేవిధంగా ఇండస్ట్రీకి ఎంతో టాలెంట్ కలిగినటువంటి డాన్స్ కొరియోగ్రాఫర్లను పరిచయం చేసిన ఘనత రాకేష్ మాస్టర్ గారికి మాత్రమే ఉందని చెప్పాలి.అయితే రాకేష్ మాస్టర్ జూన్ 18వ తేదీ మరణించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఒక్కసారిగా ఆయన శిష్యులు కొరియోగ్రాఫర్లు తీవ్రస్థాయిలో ఎమోషనల్ అయ్యారు.

ఈ విధంగా రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు.ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్లు అందరూ కలిసి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.అదే విధంగా రాకేష్ మాస్టర్ సంస్కరణ సభను కూడా శేఖర్ మాస్టర్ ( Sekhar Master ) నిర్వహించడమే కాకుండా ప్రతి ఏడాది రాకేష్ మాస్టర్ పురస్కార వేడుకలను ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు.
అయితే కళామతల్లికి ఎంతో సేవ చేసినటువంటి రాకేష్ మాస్టర్ ఎప్పుడుకి గుర్తుండి పోవాలని రాకేష్ మాస్టర్ ప్రాణ స్నేహితులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాకేష్ మాస్టర్ మరణించడంతో 11 అడుగుల ఎత్తు కలిగినటువంటి రాకేష్ మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆయన ప్రాణ స్నేహితులు ఆలేటి ఆటం( aaleti autumn ).ఈయన రాకేష్ మాస్టర్ కు ప్రాణ స్నేహితులు ఆయన తృతీయ శ్వాస విడిచే వరకు ఆయన పక్కనే ఉన్నారు.ఈ క్రమంలోనే తన స్నేహితుడి మరణాంతరం ఈయన ఏకంగా 11 అడుగుల ఎత్తు కలిగినటువంటి రాకేష్ మాస్టర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఈ విగ్రహం హైదరాబాద్లో తుదిమెరుగులు దిద్దుకుంటుంది.ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విగ్రహానికి అయ్యే ఖర్చును మొత్తం ఆలేటి ఆటం భరిస్తున్నారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈ విగ్రహం ఫోటో పై కొందరు నేటిజన్స్ కామెంట్ చేస్తూ ఈ విగ్రహం చూస్తుంటే అసలు రాకేష్ మాస్టర్ విగ్రహం లాగా లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







