చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది.
తాజాగా ‘కోబ్రా” చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ (AMB)లో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది.చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ ఈవెంట్ కి జనం భారీగా హాజరయ్యారు.
చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.మీ అందరినీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా వుంది.ఈ ఎనర్జీని చూసి చాలా రోజులైయింది.ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు.
కోబ్రాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు లాంటి మంచి నిర్మాత విడుదల చేయడం చాలా ఆనందంగా, గర్వంగా వుంది.ఏవీ చూసినప్పుడు ఇన్ని పాత్రలు నేనే చేశానా ? అని నాకే ఆశ్చర్యమేసింది.మనందరికీ సినిమా అంటే ప్రేమ.నాకు నటన మీద ఎంతపిచ్చో మీకు సినిమా మీద అంత పిచ్చి.మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు.నా సినిమా థియేటర్లోకి వచ్చి మూడేళ్ళు అయ్యింది.
ఈ సినిమాతో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది.కోబ్రా విజువల్ ట్రీట్.
కోబ్రా, అపరిచితుడు లాంటి సైకలాజికల్ థ్రిల్లర్.యాక్షన్, రోమాన్స్, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ అన్నీ అంతకుమించి వుంటాయి.
ఇందులో ముగ్గురు హీరోయిన్స్ శ్రీనిధి, మీనాక్షి , మృణాళిని.ముగ్గురు పాత్రలు బావుంటాయి.
కోబ్రా మీ అందరికీ నచ్చుతుంది.కోబ్రా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
మా ఆవిడ ఫోన్ చేసి తనకే టికెట్లు దొరకడం లేదని చెప్పింది.ఈ మాట విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.
కోబ్రా సినిమా చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.సినిమా చూస్తున్నపుడు మీరూ ఎంజాయ్ చేస్తారు.
కోబ్రా ఆగస్ట్ 31న వస్తోంది.ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
ఎన్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.విక్రమ్ గారు సెన్సేషనల్ హీరో.విక్రమ్ గారు, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కోబ్రా చిత్రాన్ని ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు.ఈ సినిమా కోసం రష్యాలో మైనస్ డిగ్రీల వద్ద కూడా చిత్రీకరణ జరిపి ఒక ఫీస్ట్ లాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఎప్పుడూ ఆదరిస్తారు.ఆగస్ట్ 31 వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా థియేటర్లోకి వస్తోంది.
ప్రేక్షకుల ఆశీర్వాదం ఈ చిత్రానికి వుండాలి” కోరారు.
ఏఆర్ రెహ్మాన్ ( వీడియో బైట్) : తెలుగు ప్రేక్షకులకు నమస్కారం.మీ అందరి ప్రేమ అభిమానంకు కృతజ్ఞతలు.కోబ్రా ఆగస్ట్ 31న విడుదలౌతుంది.థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుతున్నాను.
శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.
కోబ్రా భారీ సినిమా.ఆగస్ట్ 31న వస్తోంది.
అందరూ కోబ్రా విజువల్ ట్రీట్ ని థియేటర్లో ఎక్స్ పిరియన్స్ చేయండి” అన్నారు మృణాళిని మాట్లాడుతూ.ఇక్కడి వచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
మీరుచూపిస్తున్న ప్రేమని మర్చిపోలేము.విక్రమ్, అజయ్ గారితో పాటు మిగతా టీం అంతా అద్భుతంగా పని మీ అందరూ ఎంజాయ్ చేసేలా కోబ్రా చిత్రాన్ని తీర్చిదిద్దాం.
కోబ్రా చాలా భారీ సినిమా.విజువల్ ట్రీట్.
ఆగస్ట్ 31న అందరూ థియేటర్లో సినిమా చూడండి” అని కోరారు.మీనాక్షి మాట్లాడుతూ.
మీ అందరినీ కలవడం ఆనందంగా వుంది.కోబ్రా మూవీ విజువల్ వండర్.
ఆగస్ట్ 31 న సినిమా విడుదలౌతుంది.అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి” అని కోరారు.
తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.







