మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు మెగాస్టార్.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఆచార్య బిగ్గెస్ట్ ప్లాప్ తో మెగా ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ చెందారు.
ఇక ఆచార్య తర్వాత కూడా చిరు రీమేక్ సినిమాతోనే రాబోతున్నాడు అని తెలిసి ఈ సినిమా అసలు హిట్ అవుతుందో లేదో అని ఆందోళన చెందారు.
కానీ అందరి ఆందోళనను తరిమేస్తూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అనేలా చేసాడు.
ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించింది.
అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ వంటి వారు కూడా ఈ సినిమా కీలక రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మెగాస్టార్ మంచి ఖుషీలో ఉన్నారు.ఈ క్రమంలోనే తాను ఎలాంటి సినిమాలు చేస్తాడు అనే విషయం వెల్లడించాడు.
మెగాస్టార్ సినిమాలు అంటే డ్యాన్స్ అదిరిపోయే స్టెప్పులు, సాంగ్స్ ఉంటాయి అని ప్రేక్షకులు నమ్మేవారు.
కానీ ఇప్పుడు సీనియర్ అయినా నేపథ్యంలో అలాంటివి లేకుండా చేస్తున్నాడు.ఈ విషయంపై మెగాస్టార్ మాట్లాడుతూ.నన్ను నేను కొత్తగా ఆవిష్కరించు కోవాలని ఈ పాటలు, హీరోయిన్ కూడా లేని సినిమాలు చేస్తున్నాను అని.తెలిపాడు.అయితే భోళా శంకర్, 154 లో మాత్రం ఇలాంటివి అన్ని ఉంటాయి అని తెలిపాడు.
మరి ముందు ముందు మెగాస్టార్ సినిమాలు అంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అని చెప్పకనే చెప్పాడు.