అమితాబ్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెష్.. పోస్ట్ వైరల్!

బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) బాలీవుడ్ మెగాస్టార్ అనే చెప్పాలి.ఈయన ఈ రోజు అక్టోబర్ 11న తన 81వ పుట్టిన రోజు వేడుకను జరుపు కుంటున్నారు.

 Chiranjeevi Wishes Amitabh Bachchan On Birthday And Celebrates Their Enduring Fr-TeluguStop.com

దీంతో ఈ లెజెండరీ నటుడికి అన్ని ఇండస్ట్రీల సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెష్ చెబుతున్నారు.దీంతో ఈయన పుట్టిన రోజు శుభాకాంక్షలతో ఈ రోజు అమితాబ్ పేరు మారుమోగి పోతుంది.

మరి అమితాబ్ బచ్చన్ కు ఎంతో సన్నిహితంగా ఉండే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మెగాస్టార్ సైరా సినిమా సమయంలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

”గురూజీ.మీకు 81వ పుట్టిన రోజు శుభాకాంక్షలు.మీరు ఆరోగ్యం, సంతోషంగా ఉండాలి.

మీ నటన ప్రతిభ అనేక సంవత్సరాల పాటు లక్షలాది మంది స్ఫూర్తిని ఇవ్వాలి.మీ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్.

ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్ గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను” అంటూ చిరు పోస్ట్ చేసారు.

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.ఇక ఈ పోస్ట్ లోని పిక్స్ కూడా సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ కూడా అమితాబ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.అలాగే ముంబైలోకి బిగ్ బి హౌస్ ముందు భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు.

ఆయన అభిమానులకు అభివాదం తెలిపారు.ఇక ప్రజెంట్ అమితాబ్ తెలుగులో ప్రభాస్ కల్కి సినిమాలో ( Kalki 2898 AD )నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఈయన కీలక రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube